తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక ప్రకటించిన కేటీఆర్

దీపావళి పర్వదినాన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు శుభవార్త వినిపించింది. నేడు కేటీఆర్ స్వయంగా మీడియాతో మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆస్తి పన్నులో 50శాతం రాయితీ ఇస్తున్నట్టు వెల్లడించారు. ఇది రూ.15 వేల వరకు ఆస్తిపన్ను కట్టిన వారికి వర్తించనుందని తెలిపారు. ఇతర ప్రాంతాల్లో రూ.10 వేలలోపు ఆస్తి పన్నుకట్టే వారికి వర్తించనుందని వెల్లడించారు. దీనిని రాష్ట్రవాసులందరికీ దీపావళి కానుకగా ఆయన అభివర్ణించారు. దీని వల్ల హైదరాబాద్‌లో 13 లక్షల 72 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. ఆస్తి పన్నులో రాయితీతో రాష్ట్రంపై రూ.130 కోట్ల భారం పడిందన్నారు. వర్షం ఆగకముందే వరద సాయం ప్రకటించిన ఘనత తమదేనన్నారు. నిజమైన వరద బాధితులు మీ-సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని కేటీఆర్ తెలిపారు.