కాకమ్మ గువ్వమ్మ కథలు సింగనమల నియోజకవర్గ ప్రజలకు చెప్పకండి

అనంతపూర్: జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి చొప్పా చంద్ర శేఖర్ మీడియా ముఖంగా మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కల్పించిన భారత రాజ్యాంగం ద్వారా మీకు వచ్చిన హక్కు దళిత ఎమ్మెల్యే మీరు ఈ ఐదు సంవత్సరాలలో ఏనాడైనా దళిత ఎమ్మెల్యేగా ప్రవర్తించారా.. అగ్రవర్ణాల చేతిలో బందీగా అధికారాలన్నీ వారికి ఇచ్చి ఐదు సంవత్సరములు కీలుబొమ్మగా ప్రవర్తించారే మన నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో పార్టీ పెద్దలుగా ఆరు మందిని మీ బంధువులను నియమించినపుడు దళిత మహిళను మన దళితులకు న్యాయం చేయాలని గుర్తుకు రాలేదా మన నియోజకవర్గ పరిధిలోని ఎంపీపీ లు జడ్పీటీసీలు ఆఖరికి స్వతంత్రులైన పంచాయతీ దళిత సర్పంచ్ లకు నిధులు సరీగా రాక అల్లాడుతుంటే అప్పుడు గుర్తుకు రాలేదా దళిత మహిళా ఎమ్మెల్యే ను అని.. మీ నాయకుడు జగన్ రెడ్డి.. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళిత యువతకు అందవలసిన మొత్తాన్ని వేరొక దానికి వాడేటప్పుడు గుర్తుకు రాలేదా దళిత మహిళా ఎమ్మెల్యేను అని తల్లి అని దళితుల పక్షాన జనసేన పార్టీ మిమ్మల్ని నిలదీస్తుంది.. మన నియోజకవర్గంలో మనకు కావలసిన నీటిని వేరొకరు దోచుకుంటున్నా మనకు మన నియోజకవర్గంలోనే ఇసుక, ఎర్రమట్టి కొండలను చుక్కల భూముల పేరుతో పేద రైతులను మరియు జగనన్న కాలనీల చుట్టూ వున్న ప్రభుత్వ భూములను, మీ బంధువులు దోచుకుని తింటున్నా ఐదు సంవత్సరాలు ప్రజా దోపిడీని చూస్తూ మిన్నకుండి కేవలం తొందరలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రజలకు ఏదో కథలు చెబుతాంలే అనుకుంటే సింగనమల నియోజకవర్గంలోని దళితులు మరియు ప్రజలనీ మాటలను నమ్మేటంత అమాయకులు కారు.. పుణ్యకాలంఅయిపోయిన తర్వాత పుత్రుడు పిండం పెట్టినట్లు అధికారంలో ఉన్న సంవత్సరములు సింగనమల నియోజకవర్గంలో మీ బంధువులకు ఊడిగం చేసే ఒకరిద్దరికి తప్ప ఏ దళితులకు ఏ విధంగా సహాయ పడని మీరు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి నేను దళిత మహిళను నా మాట అధికారులు ఎవరూ వినలేదు పెద్దపెద్ద నాయకుల అడ్డుపడుతున్నారు అంటూ మీ చేతకానితనాన్ని ప్రజలకు తెలిపినందుకు ధన్యవాదములు. మాయ మాటలతో ప్రజలను ఏ మార్చాలని చూస్తే ప్రజలు మీ మాటలను నమ్మరు మిమ్ములను ఒక దళిత మహిళగా సింగనమల నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్నందుకు ఏరోజైనా మీరు అసెంబ్లీలో దళితుల సమస్యలపై కానీ మన నియోజకవర్గ సమస్యలపై కానీ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా అనే జనసేన పార్టీ ప్రశ్నిస్తోంది. మీ అధినాయకుడు జగన్ రెడ్డి గారి భజన చేసుకుంటూ ఆయన మెప్పు పొంది మీ కుటుంబానికి పదవులు తెచ్చుకున్నారే కానీ.. మన నియోజకవర్గంలో మీ బంధువు గణం అందినంతవరకు దోచుకుంటున్న ప్రజల తరఫున ప్రశ్నించలేకపోయినందుకు మిమ్ములను ఎన్నుకున్న ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారు ఇటువంటి చేతకాని ఎమ్మెల్యే మా సింగనమల నియోజకవర్గం కు అవసరం లేదని నిర్ణయించుకున్నారు. ఇక మీరు.. మీ బంధుగణం దోచుకున్న దోపిడీ చాలు. మీకు ఒక దండం.. మీ వైసీపీ పార్టీకి ఒక దండం.. చాలు.. చాలు..మీ నాయకుడి దోపిడీ.. మీ దోపిడీ… మా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే జనసేన తెలుగు దేశం పార్టీల ఉమ్మడి ప్రభుత్వం రావాలని ప్రజలు నిర్ణయం తీసుకున్నారు.. తల్లీ.. అని చొప్పా చంద్ర శేఖర్ పేర్కొన్నారు.