తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి

పత్తికొండ నియోజకవర్గం: పత్తికొండ టౌన్ నందు, తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని జనసేన సిపిఐ టిడిపి సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పత్తికొండ ఎంపీడీవో ఆఫీస్ నుండి నాలుగు స్తంభాల కూడలి వరకు అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టి నాలుగు స్తంభాల కూడలి దగ్గర నిరసన తెలుపడం జరిగింది. తదనంతరం జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ బాధితుడు సిజి రాజశేఖర్ మాట్లాడుతూ.. గత సంవత్సరం అక్టోబర్ నెలలో సరైన వర్షపాతం నమోదు కాకపోవడం వల్ల మా పత్తికొండ నియోజకవర్గమును కరువు నియోజకవర్గంగా ప్రకటించాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆరోజు కలెక్టర్ గారు మాట్లాడుతూ మేము నియోజకవర్గాన్ని మొత్తం సర్వే చేస్తామని తదనంతరం పై అధికారికి పంపిస్తామన్నారు, నవంబర్ నెలలో కరువు మండలాలు జాబితా వచ్చింది. మొదట నియోజకవర్గంలో ఉన్న పత్తికొండ మద్దికేర వెల్దుర్తి మండలాలను మాత్రమే కరువు మండల ప్రకటించారు. మరుసటి రోజు క్రిష్ణగిరిను కూడా కరువు మండలంగా ప్రకటించారు కానీ తుగ్గలి మండలాన్ని మాత్రం కరువు జాబితాలు చేర్చలేదు, ఆ రోజు నుండి ఈరోజు వరకు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. గత నెలలో తుగ్గలి మండలంలో ప్రభుత్వ ఆఫీసులో అన్నిటికీ తాళాలు వేసి రోడ్లపై బైఠాయించి తుగ్గిలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని నిరసన తెలిపినప్పటికీ ఇంతవరకు ప్రభుత్వం నుండి ప్రభుత్వ అధికారులు సరైన సమాధానం లేకపోవడం వల్ల ఈరోజు వరకు సరైన సమాధానం రాకపోవడం వల్ల, ఆర్డీవో ఆఫీస్ కి తాళాలు వెయ్యటానికి వెళుతున్నాం అన్నారు, అలాగే ఈ వైసీపీ ప్రభుత్వానికి రైతు అంటే చిత్తశుద్ధి అనేది లేదు రైతులపై ఇంత కక్ష సాధింపు ఈ వైసీపీ ప్రభుత్వానికి ఎందుకో అని అన్నారు. ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కి ఉర్లగడ్డ ఉల్లిగడ్డ కూడా తేడా తెలియని వ్యక్తి మన రాష్ట్ర సీఎం, ఇలాంటి వ్యక్తికి రైతుల సమస్యలపై ఎలాంటి అవగాహన ఉందో అర్థం చేసుకోవాలి, ఇప్పటికైనా తుగ్గిలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించుకుంటే స్థానిక ఎమ్మెల్యే గారు ఓటు అడగడానికి కూడా అర్హత లేదని తెలియజేశారు. తుగ్గిలి రైతులు వైసీపీ నాయకులను చొక్కా పట్టుకొని నిరీదిస్తారని, ఈ ఎమ్మెల్యే గారికి, వైసీపీ ప్రభుత్వానికి సీఎం జగన్ రెడ్డికి పత్తికొండ నియోజకవర్గ ప్రజలు ఓటుతో సరైన సమాధానం చెబుతారని అన్నారు. నాలుగు స్తంభాల కూడలి నుండి ఆర్డిఓ ఆఫీసుకు తాళాలు వేయడానికి వెళ్లిన, అఖిలపక్షాల నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో, ఆర్ డి ఓ ఆఫీస్ ముందు తీవ్ర ఉత్కంఠ జరుగుతుంటే ఆర్డీవో గారు వచ్చి, తుగ్గలి మండలాన్ని కరువు జాబితాలో చేర్చాలని పై అధికారులు కూడా అనేక నివేదకులు పంపించాం, త్వరలో కరువు మండలంగా ప్రకటిస్తారని, అలాగే మరోసారి అధికారులకు తెలియజేస్తామని తెలిపారు.