మేదరి కుటుంబాలతో జనసేన మాటామంతి

కాకినాడ సిటి: జనసేన పార్టీ ఆధ్వర్యంలో పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నగరంలోని మహాలక్ష్మినగర్లోని కర్ణభక్తుల కుటుంబాలను మరియు ముత్తానగర్లోని మేదరి కుటుంబాలను కలిసి మాటామంతి కార్యక్రమాన్ని చేపట్టారు. గతకొన్ని రోజులుగా తమ పార్టీ అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నగరంలోని వివిధ వర్గాల కుటుంబాలను కలిసి వారితో వారు ఎదుర్కుంటున్న సమస్యలను తెలుసుకుని వారి కుటుంబసభ్యుడిగా జనసేన పార్టీ తరపున అండగా నిలిచేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ మాట్లాడుతూ కర్ణభక్తులు ఎన్నోఏండ్లుగా నేత పనిని చేపట్టి కులవృత్తిగా చేసుకుని ఉన్నారనీ దురదృష్టవశాత్తూ నేటి జీవన విధానంలో నేత వస్త్రాల ఆదరణ గణనీయంగా పడిపోయి అనేక రకాల ఇబ్బందులని ఎదుర్కొంటున్నారనీ, ఇలాంటి పరిస్థితులలో వీరికి 50 ఏండ్లు దాటిన తరువాత ప్రభుత్వం ద్వారా పొందే పెన్షన్ పట్టణాలలో అందకపోవడం డారుణమన్నారు. వీరు జీవించే ప్రాంతం గ్రామాలనుండీ పట్టణలలోకి రూపాంతరం చెందినపుడు అందులో వీరి ప్రమేయం ఏముందనీ అందుకు తగిన విధంగా నిబంధనలను మార్చాలని డిమాండ్ చేసారు. ముత్తానగర్లోని మేదరి కుటుంబాల వ్యధ కూడా దారుణమనీ, ప్రభుత్వ పధకాలు అరకొరగా అందచేస్తూ రకరకాల కారణాలు చూపెడుతూ వివిధ పధకాలలో లబ్దిదారులుగా అనర్హత చూపెట్టడాన్ని నిరశించారు. అసలు పేదల జీవితాలలో అభివృద్ధి చెందేలా చర్యలు చేపడితే ఈ వై.సి.పి ప్రభుత్వాన్ని పధకాలు అడగాల్సిన అవసరం లేదనీ, చాలీ చాలని విధంగా సహాయం అందించడం లోపభూఇష్టమైన పాలనే అని దుయ్యబట్టారు. జనసేన పార్టీ తప్పకుండా వీరందరి తరపున సంస్కరణలను తీసుకు వచ్చేలా కార్యాచరణ రూపొందించుకుంటోందనీ రాబోయే ఉమ్మడి కూటమిలో తమకు మద్దతు తెలియచేయవలసినదిగా కోరారు.