బెళుగుప్పలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు

ఉరవకొండ: బెలుగుప్ప మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగదేశం, జనసేన పార్టీల ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 161వ జయంతి సందర్భంగా స్వామి వివేకానందుడి పోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం యువతకు స్వామి వివేకానంద స్ఫూర్తిదాయకమని అందుకే ఆయన పుట్టిరోజు పర్వదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాం అని వారు
గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జిల్లా కార్యదర్శి మల్లికార్జున, జనసేన మండల కాశంశెట్టి సుధీర్, ఇరుపార్టీల నాయకులు పాల్గొన్నారు.