దెందులూరులో మనఊరు మనఆట సంక్రాంతి సంబరాలు

దెందులూరు: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, పి.ఎ.సి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావుల ఆదేశాల మేరకు ఉభయ గోదావరి జిల్లాల మహిళా రీజనల్ కో-ఆర్డినేటర్ శ్రీమతి కాట్నం విశాలి సూచనల మేరకు దెందులూరు నియోజకవర్గ జనసేన నాయకులు కొఠారు లక్ష్మీ, ఆదిశేషుల ఆధ్వర్యంలో వేగివాడ గ్రామంలో దెందులూరునియోజకవర్గ మనఊరు మనఆట సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. దీనికి ముఖ్య అతిధిగా పాల్గొన్న కాట్నం విశాలి ముగ్గులను పరిశీలించి మహిళలకు తమ సూచనలు అందచేసారు. వీరమహిళలందరూ కలిసి తమ నియోజకవర్గం విచ్చేసిన విశాలికి సన్మానం చేసారు. తదనంతరం విజేతలకు కొఠారు లక్ష్మీ ప్రధమ(5000), ద్వితీయ(3000), తృతీయ (2000) నగదు బహుమతులు అందచేసారు. తొలి మూడు కన్సొలేషన్ బహుమతులుగా 1000 చెప్పున మూడు నగదు బహుమతులు, తరువాత మూడు కన్సొలేషన్ బహుమతులుగా మూడు చీరలు బహుమతులుగా అందచేసారు. పోటీదారులందరికీ పార్టిసిపేషన్ గిఫ్టులు అందచేసారు.