పితాని ఆధ్వర్యంలో వైభవంగా సంక్రాంతి సంబరాలు

డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ కొనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం: సంక్రాంతి సంబరాలలో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు మన ఊరు మన ఆట కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాష్ట్ర జనసేన పార్టీ పిఎసి సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో ముమ్మిడివరం మండలం, పళ్లవారిపాలెం గ్రామంలో ముగ్గుల పోటీలను మరియు సంక్రాతి సంబరాలను ఘనంగా నిర్వహించారు.ముగ్గులు పోటీలో పాల్గొన్న వారికీ ప్రధమ బహుమతిగా ఎలక్ట్రికల్ మిక్సీ, ద్వితీయ బహుమతిగా రైస్ కుక్కర్, తృతీయ బహుమతిగా నాన్ స్టిక్ కిచెన్ సెట్ బహుమతులు ఇవ్వటం జరిగింది అలాగే పాల్గొన్న వారందరికీ ప్రోత్సాహక బహుమతులు ఇచ్చారు.
ఈ సందర్బంగా పితాని బాలకృష్ణ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరకి సంక్రాతి శుభాకాంక్షలు తెలిపి, రాబోయే రోజులలో పార్టీ తరుపున మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాము అని పార్టీ శ్రేణులుకు పిలుపునివ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు, వీరమహిళలు అభిమానులు, పళ్లవారపాలెం జనసేన నాయకులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.