ఎమ్మెల్సీ అభ్యర్థి జయ సారధి రెడ్డి మీడియా తో చిట్ చాట్

నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్ట భద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి జయ సారథి రెడ్డి మీడియాలో చిట్ చాట్ లో పాల్గొని ప్రభుత్వం వైఫల్యం చెందిన  విషయాలు గురించి వివరించారు.

👉నీళ్లు, నిధులు, నియమాలను విషయం లో ప్రభుత్వం వైఫల్యం చెందింది.

👉తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది.

👉లక్ష ముఫై వేల మంది కల్పించాం ప్రభుత్వం అబద్ధపు ప్రచారం చేస్తున్నారు.

👉2014 తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు కాక ముందు సింగరేణి లో 58 వేల మంది  కార్మికులు పనిచేస్తున్నారు ప్రస్తుతం 44 వేల మంది పై చిలుకు సింగరేణి కార్మికులు  ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఎక్కడ ఉద్యోగ కల్పన జరిగింది?.

👉బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ని ప్రవేట్ పరం చేయాలని బీజేపీ ప్రయత్నం చేస్తోంది.

👉అన్ని కర్మాగారలని బీజేపీ ప్రభుత్వం ప్రవేట్ పరం చేస్తున్నారు.

👉వరంగల్ మహా నగరని తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది ఏమి లేదు. ఏమీ ఇచ్చారో ప్రజలకు చెప్పాలి .

👉పల్లా రాజేశ్వర్ అబద్ధపు ప్రచారం తో ఓట్లు దండుకోవలని చూస్తున్నాడు.

👉ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేసే జర్నలిస్టుల పక్షాన ఎమ్మెల్సీ గా పోటీ చేస్తున్నాను..