నేడు భారత్ బంద్…

దేశంలో పెట్రోల్ ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరలకు నిరసనసగా ట్రేడ్ యూనియన్లు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. దేశంలో పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలని, దేశవ్యాప్తంగా ఒకే ఇంధన ధరలు ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక బంద్ లో భాగంగా సీఏఐటి చక్కా జామ్ కు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా దాదాపుగా 40 లక్షల వాహనాలు నిలిపివేస్తున్నట్టుగా సీఏఐటి ప్రకటించింది. 1500 ప్రాంతాల్లో నిరసనలు తెలియజేయబోతున్నారు. ఇక భారత్ బంద్ కు మద్దతుగా దేశంలోని 40వేల ట్రేడ్ అసోసియేషన్లు మద్దతు ఇస్తున్నాయి.