బెంతు, ఒరియాల రిలే నిరాహారదీక్ష 27వ రోజు

ఇచ్ఛాపురం నియోజకవర్గం: కవిటి పట్టణంలో బెంతు ఒరియా కులస్తులు చేస్తున్న రిలే నిరాహారదీక్ష 27వ రోజు చేరుకుంది. సర్పంచ్ జోగోబొంధు దొళాయి ఆధ్వర్యంలో లోండపుట్టుగ గ్రామస్తులు, మహిళలు, యువత, పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు. తమ జాతి గుర్తింపు కోసం మూడు దశాబ్దంల నుంచి ప్రభుత్వానికి, అధికారులకు గోడు విన్నపిస్తున్న మారని బెంతో ఒరియా తలరాతలుగా మిగిలాయి. భారత రాజ్యాంగంలో క్రిస్తు పూర్వం నమోదు కాబడిన షెడ్యూల్ తెగలో బెంతో ఒరియా యస్ టి గుర్తింపు పొందిన మాకు అకారణంగా ప్రభుత్వ జీఓ జారీ లేకుండా దురుద్వేసంతో కుల ధ్రువీకరణ పత్రాలు నిలిపి వేయడం పట్ల రెవెన్యూ శాఖపై ప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. ఈ దుశ్చర్య వల్ల విద్యార్థుల జీవితాలలో నిరుద్యోగం తాండవం చేస్తుందని వలస విధానమే దిక్కుగా మారిందని అని వాపోయారు. సోంపేట, కవిటి, కంచిలి, ఇచ్ఛాపురంలో గల బెంతో ఒరియలకు కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని తమ నిరసనతో కోరారు. ఈ కార్యక్రమంలో ఖేతో దోళాయి, జోగోబొందు దొళాయి, ప్రభాకర్ దొళాయి, ఎక్స్ సర్పంచ్ పురుషోత్తం, జయసేన్ బిసాయి, గోపి బిసాయి, దుదిస్టి మజ్జి, బృందావన్ బిసాయి, కృష్ణ దోళాయి తదితరులు పాల్గొన్నారు.