దొంతమూరులో దళిత వాడల్లో జనచైతన్యం

పిఠాపురం, చైతన్య వంతమైన దళిత యువకులను జనసేన పార్టీ వైపుగా నడపడమే లక్ష్యంగా జనసేన పార్టీపై ఒక కులముద్రను వేసే విషపూరిత కుట్రను తిప్పి కొట్టడమే ధ్యేయంగా పిఠాపురం రూరల్ జనసేన నాయకుడు మరియు దళిత నాయకులు అయిన వాకపల్లి సూర్యప్రకాశ్ పిఠాపురం మండల వ్యాప్తంగా మొదలు పెట్టిన దళిత వాడల్లో జనచైతన్యం అనే కార్యక్రమం దొంతమూరు గ్రామం దళిత వాడకు చేరుకుంది. పిఠాపురం నియోజవర్గ జనసేన నాయకులు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు సమక్షంలో నిర్వహింపబడిన ఈ కార్యక్రమం తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బండి ఏసుబాబు ఆధ్వర్యంలో కొనసాగింది. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి ఘనమైన నివాళులు అర్పించిన అనంతరం వాకపల్లి సూర్య ప్రకాష్ స్థానిక యువ క్రీడాకారులకు వాలీబాల్ కిట్ అందించిన తదనంతరం పవన్ కళ్యాణ్ ఫాన్స్ అయిన దళిత యువకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నాయకులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జనసేన పార్టీ ప్రధాన సిద్ధాంతమే కులాలను కలిపే ఆలోచన విధానం అని ఈ నిజాన్ని మండలం అంతా తెలియజేసేలా వాకపల్లి సూర్య ప్రకాష్ ప్రతి ఊరు వాడ తిరుగుతూ పవన్ కళ్యాణ్ ఫాన్స్ అయినటువంటి ఉత్సాహవంతమైన దళిత యువకులను పార్టీలో యాక్టివ్ గా ఉండేలా ప్రోత్సహించేలా కార్యక్రమం చేయడం అభినందనీయమని, ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గం అంతా చేపట్టాలని అందుకు తమ పూర్తి సహకారం ఉంటుందని తెలియజేశారు. మరియు స్థానిక దళిత యువతను ఉద్దేశించే పవన్ కళ్యాణ్ మంచితనాన్ని మీకు నేను కొత్తగా చెప్పేది లేదు అని మీ యువకులు నాయకులుగా ఎదిగేందుకు జనసేన పార్టీ తోడుగా నిలుస్తుందని మనం అందరం సమిష్టిగా పోరాడి పవన్ కళ్యాణ్ ని సీఎం చేసుకోవాలని తెలిపారు. వాకపల్లి సూర్య ప్రకాష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ నన్ను ఆదర అభిమానంతో స్వాగతించిన దొంతమూరు గ్రామ పెద్దలు జనసేన పార్టీ జిల్లా సెక్రెటరీ ఆయన బండి ఏసుబాబు, నియోజకవర్గ నాయకులు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ యువతకు జనసేన పార్టీ సిద్ధాంతాలతో కూడిన పాంప్లెట్స్ ని ఇచ్చి అవి కాలనీ అంతా పంచి పెట్టవలసిందిగా కోరారు. మరియు దళిత యువత ఓట్లకు మాత్రమే పరిమితం అయ్యి ఫాన్స్ గా మాత్రమే మిగిలిపోకుండా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా పని చేయాలని మన సామర్థ్యం మేరకు జనసేన పార్టీ అందిస్తున్న నాయకత్వం స్వీకరించి పవన్ కళ్యాణ్ ని సీఎం చేయడంలో భాగస్వామ్యం కావాలని పిలిపిచ్చారు. పవన్ కళ్యాణ్ అభిమానులైన కె. నరేష్, ఆర్.శాంసన్, జి.నరేష్, కె.వెంకటరమణ, జి.విజయ్, కె.శేఖర్, కె.చక్రి, జి.డేవిడ్, వి.ప్రవీణ్, టి.బాబీ మొదలగు దళిత యువకులతో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో మండల నాయకులు అడపా శివరామకృష్ణ, బొజ్జ శ్రీను, గంజి గోవిందరాజు, గాబు గంగబాబులతోపాటుగా దొంతమూరు గ్రామ యువ నాయకులు బండి వెంకన్న బాబు మరియు స్థానిక జనసైనికులు పాల్గొన్నారు.