బెంతో ఒరియాల మనవి – స్పందించని రెవిన్యూ డిపార్ట్మెంటు..!

ఇచ్చాపురం, బెంతో ఒరియాల రిలే నిరాహారదీక్ష 29వ రోజుకు చేరుకున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొన్నాయి పుట్టుగ గ్రామ ఎస్.భైరవి, మహిళలు, పెద్దలు యువత పాల్గొన్నారు. బెంతో ఒరియా ప్రజలకు జరుగుతున్న అన్యాయం రాజ్యంగ విరుద్ధమని, కులదృవీకరణ పత్రాలు అకారణంగా గవర్నమెంటు నుండి ఎటువంటి ఆదేశాలు జారీ చేయనప్పటికి, ఎక్కడో మెలియపుట్టి మండలంలో దొంగ సర్టిఫికెట్లు ఐదు పొంది జాబ్ లు చేస్తున్న వ్యక్తులను కారణంగా చూపి మాయొక్క కమ్యూనిటీ కుల దృవీకరణ పత్రాలు ఆపడమనేది రెవిన్యూ డిపార్ట్మెంట్ తాలూకా అధికార దుర్వినియోగానికి నిదర్శనమని, ప్రభుత్వమే బాధ్యత వహించి వారిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము, తప్పుడు ఆధారాలు చూపించి ఆనాటి రెవిన్యూ అధికారుల చేత సర్టిఫికెట్ పొందినావారి పైన చర్యలు తీసుకోవాలని.కమిటీలు మీద కమిటీలు వేసి కాలయాపన చేయకుండా మా యొక్క కులదృవీకరణ పత్రాలు వెంటనే పునరుద్ధరణ చేయాలని ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నామని లేనియెడల మా యొక్క ఉద్యమము తీవ్రతరం చేస్తాము, అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భైరవి సహు, తిరుపతి సహు, సుఖదేవ్ సహు, సంజయ్ సాహు, నిరంజన్ సహు,కృష్ణ దొలై, బెదోబోరో తదితరులు పాల్గొన్నారు.