వేములపల్లి గ్రామంలో పల్లె పధాన జనసేన

నందిగామ నియోజకవర్గం: కంచికచర్ల మండలం,
వేములపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన పల్లె పధాన జనసేన కార్యక్రమంలో నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా జై – జనసేన జై జై – జనసేన అంటూ జనసైనికులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ గ్రామం అంతా రమాదేవి పర్యటించారు. రమాదేవి ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వేములపల్లి గ్రామ ప్రజలు స్థానిక సమస్యలను రమాదేవికి తెలియజేశారు. ఈ సందర్భంగా తంబళ్ళపల్లి రమాదేవి మాట్లాడుతూ.. ఈ వేములపల్లి గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, ప్రజలు తన దృష్టికి తీసుకు వచ్చారని, ముఖ్యంగా గ్రామంలో మంచి నీళ్ళు గత కొన్ని రోజులుగా రావడం లేదని, ఒక వేళ నీళ్ళు వచ్చినా కూడా మురికి నీళ్ళు వస్తున్నాయని, దీని వలన ఇక్కడి ప్రజలు అనారోగ్యం పాలు అవుతున్నారని చెప్పి వాపోయారు. ఎస్సీ కాలనీలో అంతర్గత డ్రైనేజీ సరిగా లేదని, సిసి – రోడ్లు సరిగా లేవని, వీధి లైట్లు ఏర్పాటు చేయలేదని ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు గారు పోలీసులను చుట్టూ తన చుట్టూ ఒక వలయంలా పెట్టుకుని గ్రామాలలో “గడప గడపకు” తిరగటం కాదని, పోలీసుల వలయాన్ని ఛేదించి గ్రామాలలో గడప గడపకు తిరిగితే అప్పుడు ప్రజలు తమ సమస్యలను మీకు తెలియజేస్తారని రమాదేవి అన్నారు. వైయస్సార్ హెల్త్ క్లినిక్ ల లో సరి అయిన పరికరాలు, అత్యవసర మందులు కానీ సరిగా లేవని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన – తెదేపా పార్టీలకు అండగా నిలవాలని, రాబోయే జనసేన – తెదేపా ప్రభుత్వంలో మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు” హలో ఏపీ – బైబై – వైసీపీ ” అంటూ రమాదేవి జనసైనికులకు, వీరమహిళలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షులు జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.