అసోం డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన హిమాదాస్‌

భారత స్టార్‌ స్ప్రింటర్‌ హిమాదాస్‌ (21) అసోంలో డీఎస్పీగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని అసోం పోలీస్‌ శాఖ ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. ఈ సందర్భంగా హిమాదాస్‌ మాట్లాడుతూ పోలీస్‌ కావాలనేది తన చిన్ననాటి కలగా పేర్కొన్నారు. తన తల్లి కూడా ఇదే కోరు కునేదని తెలిపింది. తన కల నెరవేరిందని అయితే అథ్లెట్‌గానే తన కెరీర్‌ను కొనసాగిస్తాను అని హిమాదాస్‌ వెల్లడించారు. కాగా హిమాదాస్‌ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించడంపై అసోం ముఖ్యమంత్రి సోనోవాల్‌ స్పందించారు. ఆమెకు అభినందనలు తెలుపుతూ ఈ నియామకం ద్వారా క్రీడారంగంలో రాణించాలనే ఇతర యువతకు హిమాదాస్‌ ఆదర్శంగా నిలుస్తుందన్నారు.