యస్టీ జాబితాలో బెంతో ఒరియాను పునరుద్దరణ చేయాలి

ఇచ్చాపురం, బెంతో ఒరియా గిరిజన కులస్తులను ఎస్టీ జాబితాలో పునరుద్ధరణ చేయాలని ఇచ్చాపురం నియోజకవర్గ నాలుగు మండల ప్రజలు డిమాండ్ చేశారు. తమ ప్రధాన డిమాండ్ కవిటి కేంద్రంలో 37వ రోజు నిరాహార దీక్షలో చిన్నబల్లిపుట్టుగ గ్రామస్తులు మహిళలు, యువత, పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీక్షలో అధ్యక్షులు సుమన్ బిసాయి, ఉపాధ్యక్షులు జయసేన్ బిసాయి బెంతో ఒరియా గిరిజన కులస్తులను ఉద్దేశించి ప్రసంగించారు. తమ కులం వారు సామాజికంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని ఎంతోమంది పేదరికంతో చాలా దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నారని అంతేకాకుండా ప్రభుత్వ జీవో జారీ లేకుండా అకారణంగా కుల ధృవీకరణ పత్రాలు రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు నిలిపివేయడంతో తమ పిల్లలు ఉద్యోగం, ఉన్నత చదువులకు అవకాశం లేక వలసలు వెళ్లి హోటల్లో పని చేసుకుంటున్నారని గ్రామాల్లో గలవారు కూలి పని చేసుకుంటున్నారాన్నరు. బ్రిటీష్ ప్రభుత్వం నుంచి కుల ధ్రువీకరణ పత్రాల పొందినట్లు గుర్తింపు తమకు ఉందని ఎస్టీ జాబితాలో కొత్తగా చేర్పించడం తమ వాదన కాదని సీరియల్ నెం 17 క్వలం నెం 2 లో బెంతో ఒరియా యస్టీ అని నమోదు చేయబడి ఉంది. కులధృవీకరణ పునరుద్ధరణయే మా డిమాండ్ అని పేర్కొన్నారు. తమది న్యాయపరమైన డిమాండ్ అని ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ గారు హామీ కూడా ఇచ్చి పరిష్కారిస్తానని మాటిచ్చారు. కానీ ఇప్పటి వరకు నెరవేర్చలేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రభుత్వం దీనిపై త్వరగా స్పందించి ఆదుకోవాలని కోరారు. ఎక్స్ ఎంపిటిసి బార్ల చిన్నబాబు, జడ్పిటిసి బెందాళం రమేష్, వజ్జ సునీల్ శిబిరంలో సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరి దలై, మోహన్ బిసై, జయసెన్, సుమన్, మర్ఖోండో, భాస్కర్, ప్రేమ్, కృష్ణ, మేఘనాత్, దుదిస్టి, కేశవా పురియ తదితరులు పాల్గొన్నారు.