నందిగామ జనసేనలో చేరికలు

నందిగామ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి మండలాధ్యక్షులు ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి “పల్లె పధాన జనసేన” కార్యక్రమంలో భాగంగా రాఘవాపురం, కమ్మవారిపాలెం, పల్లగిరి గ్రామాలను పర్యటించి, అక్కడ ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మూడు గ్రామాల్లోనూ గ్రామ ప్రజలు తంబళ్లపల్లి రమాదేవికి ఘన స్వాగతం పలికారు. రమాదేవి వారి గ్రామానికి రావడం, సమస్యలు అడిగి తెలుసుకోవడం పట్ల ఆనందం వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా తంబళ్ళపల్లి రమాదేవి మాట్లాడుతూ ఈ గ్రామాలలో అధికార వైసిపి ప్రభుత్వం యువతను గంజాయి వంటి మత్తుపదార్థాలకు బానిసలుగా మార్చి వారి భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేస్తోందని, ప్రతి గ్రామంలో మద్యం విక్రయాలు చాలా జోరుగా జరుగుతున్నాయని, గ్రామాలలో ఉండే ప్రజల్లో టిడిపి పార్టీ మద్దతుదారులను, జనసేన పార్టీ సానుభూతిపరులను గుర్తించి వారికి పెన్షన్లు, ప్రభుత్వ పథకాలు అందకుండా చేయడం, ఇలాంటి సమస్యలను సృష్టించి బలవంతంగా వైసిపి పార్టీకి లొంగేలా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు తెలియజేశారని, రాఘవాపురం గ్రామంలో అక్రమ మైనింగ్ జరుగుతున్నది అనీ, మైనింగ్ నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ, అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని, దానివల్ల రోడ్లు నాశనమవుతున్నాయని ప్రధాన రహదారులు నాశనం అవుతున్నాయని గ్రామంలోకి క్వారీ ద్వారా వచ్చే దుమ్ము ధూళి వల్ల గ్రామస్తులకు చాలా ఇబ్బందికరంగా ఉందని తెలియజేశారని అన్నారు. వచ్చేది జనసేన టిడిపి ప్రభుత్వమని ఈ అక్రమార్కుల చేతి నుండి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడి స్వర్ణాంధ్రప్రదేశ్ గా చేయడానికి జనసేన పార్టీ టిడిపి కలిసి కూటమిగా వచ్చే ఎన్నికల్లో మీ ముందుకు వస్తోంది మీరంతా ఆశీర్వదించి అఖండ మెజారిటీతో జనసేన-టిడిపిని గెలిపిస్తే మీ అందరి సమస్యలను పరిష్కార దిశగా మా వంతు మేము కృషి చేస్తామని గ్రామస్తులకు మాటిచ్చారు. ఈ కార్యక్రమంలో కమ్మవారిపాలెం మరియు పల్లగిరి గ్రామాల్లో జనసేన సిద్ధాంతాలు నచ్చి భారీగా 85 కుటుంబాలు స్వచ్ఛందంగా రమాదేవి సమక్షంలో కండువా కప్పించుకొని పార్టీ లో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.