దమ్ముంటే బాలశౌరి చేసిన అవినీతిని నిరూపించాలి: ఎస్ వి బాబు

మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. బాలశౌరి జనసేన పార్టీలో చేరుతున్న సందర్భంగా కృష్ణ గుంటూరు జిల్లాల నుండి భారీగా జనసైనికులు, బాలశౌరి అభిమానులు జనసేన పార్టీ మంగళగిరి కార్యాలయానికి తరలివచ్చారు. ఆ కార్యక్రమాన్ని చూస్తే అది జాయినింగ్ ప్రోగ్రాంలో కాక పెద్ద బహిరంగ సభలా ఉంది. ఆ జన సందోహాన్ని చూసి వైసిపి నాయకులు భయపడిపోతున్నారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ గౌరవ ఎంపీని బఫూనని సంబోధిస్తున్నారు. అంబటి రాంబాబుని మించిన బఫూన్ ఈ రాష్ట్రంలో ఎవరూ లేరనే విషయం ఆంధ్రరాష్ట్ర ప్రజలకు తెలుసు బహుశా అంబటి రాంబాబుకు తెలియకపోవచ్చు. బాలశౌరి ప్రసంగంలో గత నాలుగు సంవత్సరాలుగా ఈ రాష్ట్రం ఎంతగా నష్టపోయిందో వివరించారు. పవన్ కళ్యాణ్ నాయకత్వం మీద నమ్మకంతో రాష్ట్ర భవిష్యత్తు కోసం తాను జనసేనలో జాయిన్ అవుతున్నానని సభా ముఖంగా తెలియజేశారు. ఈ నాలుగున్నర సంవత్సరాలుగా ఎంపీగా బాలశౌరి మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మచిలీపట్నానికి పోర్టు, మెడికల్ కాలేజ్ రావటంలో ముఖ్య భూమిక పోషించారు. సిఆర్ఎస్ నిధులు ద్వారా అనేక గ్రామాలను అభివృద్ధి చేశారు. అంబటి రాంబాబుకి దమ్ము ధైర్యం ఉంటే బాలశౌరి చేసిన అవినీతిని గాని, తప్పులు గాని ఒక్కటైనా నిరూపించాలి. పరిపాలన చేతకాక, పని పాట లేని ప్రెస్ మీట్ లు పెట్టడానికి తప్ప అంబటి రాంబాబు అనే వ్యక్తి నీటిపారుదల శాఖ మంత్రిగా ఈ రాష్ట్రానికి చేసింది ఏంటో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ పతనం, అంబటి ఓటమి రెండు ఖాయమని పెడన జనసేన నాయకులు ఎస్ వి బాబు అన్నారు.