గుంతకల్ నియోజకవర్గ అభివృద్ధికి అన్ని పార్టీలు చిత్తశుద్ధితో పనిచేయాలి: బండి శేఖర్

గుంతకల్, బుధవారం గుంతకల్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల యందు జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గుంతకల్ నియోజకవర్గ అభివృద్ధిలో వివిధ రాజకీయ పార్టీల పాత్ర అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ హరి ప్రసాద్ యాదవ్ సభ అధ్యక్షత వహించగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బండారు ఆనంద్ బిజెపి నాయకులు గుర్రం సూర్యనారాయణ, వైఎస్ఆర్సిపి నాయకులు, దేవేంద్రప్ప జనసేన నాయకులు బండి శేఖర్, సిపిఐ నాయకులు ప్రసాద్, సిపిఎం నాయకులు చొక్కా సునీల్, సిపిఐ నాయకులు వీరభద్ర స్వామి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు మహమ్మద్ గౌస్, జాతీయ హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షులు ఆలం నవాజ్ మెప్మా, రిటైర్డ్ ఉద్యోగి రామాంజనేయులు, భారత రాజ్యాంగ అవగాహన వేదిక అధ్యక్షురాలు జింకల సరస్వతి, వెంకటేశ్వర డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ లక్ష్మీనారాయణ స్టెప్ సంస్థ అధ్యక్షులు పాండురంగ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు బండి శేఖర్ మాట్లాడుతూ గుంతకల్ నియోజకవర్గ అభివృద్ధి చెందాలి అంటే విద్య, మరియు విద్యకు తగిన ఉపాధి, ఉచిత వైద్యం, ప్రతి ఎకరాకు సాగునీరు, వ్యవసాయానికి ఉపాధిపని అనుసంధానంతో పాటు మౌళిక వసతుల కోసం అన్ని పార్టీలు చిత్తశుద్ధితో పనిచేయాలని గుంతకల్ స్పిన్నింగ్ మిల్ మూతపడడంతో గుంతకల్లులో ఉపాధి దొరక్క హైదరాబాద్ బెంగళూరు ముంబై లాంటి ప్రాంతాలకు వలస వెళ్తున్నారని వాళ్లకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించలిసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఎంతైనా ఉందని ముఖ్యంగా గుంతకల్ నియోజకవర్గంలో ఉన్న పామిడిలో టెక్స్ టైల్స్ ప్రారంభించాలనీ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అందించే రైతుల అభివృద్ధికి దోహదపడాలని పేర్కొన్నారు గుంతకల్ అభివృద్ధిని ఆకాంక్షించేవారు పార్టీలకతీతంగా కేవలం అభివృద్ధి ధ్యేయంగా కృషి చేయాలి అన్నారు.