ఇంటింటికి గాజు గ్లాస్ పంపిణీ

గుంటూరు జిల్లా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం అధ్యక్షులు బండ్రెడ్డి చందు ఆధ్వర్యంలో గుంటూరు 12 డివిజన్ లో జనసేన ఎన్నికల సింబల్ అయిన గాజు గ్లాసులు ఇంటింటికి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం అధ్యక్షులు బండ్రెడ్డి చందు మాట్లాడుతూ గుంటూరు 12వ డివిజన్ లో జనసేన ఎన్నికల సింబల్ అయిన గాజు గ్లాస్ గుర్తును ప్రతి ఒక్కరికి చేరేలా ఇంటింటికి గాజు గ్లాస్ పంపిణీ చేయడం జరిగిందని, రాబోయే ఎన్నికల్లో జనసేన-టిడిపి అభ్యర్థిని గెలిపించి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రతి ఒక్కరూ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని జనసేన పార్టీ సిద్ధాంతాలను, అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచనలను ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఆహ్వానించాలని అందుకు రాష్ట్ర ప్రజలందరూ ఎన్నికల కోసం సంసిద్ధమయ్యారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 12 డివిజన్ అధ్యక్షుడు కొణిదె దుర్గాప్రసాద్, చైతన్య, సెక్రెటరీ గుంటూరు శివ సుందర్ కుమార్, జాయింట్ సెక్రెటరీ ఉదయ్ కుమార్, అంజన్, కోటి, శశి, అభి, లక్కీ, మహేష్, దేవా, మోపిదేవి నాగరాజు, హరి పలువురు పాల్గొన్నారు.