చిన్న పాండ్రాకలో జనసేన పార్టీ గ్రామసభ

పెడన, కృత్తివెన్ను మండలం, చిన్న పాండ్రాక గ్రామంలో జనసేన పార్టీ గ్రామస్తుల సహకారంతో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఎన్నికల సమీపిస్తున్న సమయంలో ప్రతి గ్రామంలో ప్రజలను సమయుక్తపరిచి రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపే లక్ష్యంగా పెడన నియోజకవర్గ జనసేన నాయకులు ముందడుగు వేస్తున్నారు. చిన్న పాండ్రాక గ్రామంలో ఉన్న సమస్యలను గ్రామస్తులు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని గ్రామస్తులు తెలియజేశారు. ఈ నాలుగున్నర సంవత్సరాల వైసిపి పరిపాలనలో నియోజకవర్గానికి ఒరిగిందేమీ లేదని రాబోయే ఎన్నికల్లో జనసేన టిడిపి ఉమ్మడి అభ్యర్థికి మా సంపూర్ణ మద్దతు ఉంటుందని గ్రామస్తులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెడన జనసేన నాయకులు ఎస్ వి బాబు, కృష్ణా జిల్లా కార్యదర్శి కూనసాని నాగబాబు, గొట్రు రవికిరణ్, పయ్యావుల నాగాంజనేయులు, చీరల నవీన్ కృష్ణ, ఎంట్రపాటి నాగబాబు, సురేష్, తిరుమని నరసింహస్వామి, ముదినేని రామకృష్ణ, గ్రామ అధ్యక్షులు జన్యావుల నాగబాబు, ఉపాధ్యక్షులు పెద్ది సుబ్బారావు, జంపాల సాయి ప్రసాద్, వాలిశెట్టి రామూర్తినాయుడు, పుప్పాల శ్రీనివాసరావు, లంకపల్లి నాగరాజు, పులి మహేష్, లోకం సాయి, సోదబాత్తుల నాగప్రాబకారావు, ముత్యాల అశోక్ కుమార్, రాయపురెడ్డి గాంధీ, దుషణపూది అర్జునరావు, ముత్యాల తాతయ, మొటేపల్లి వెంకటేష్, కొణతం వాసు, పయ్యావుల బాలబాలాజీ, ముత్యాలసత్యనారాయణ, కూనపరెడ్డి మధుసూదనరావు, పుప్పాల నాగార్జున, కొనతాం రతయ్య, దాసరి లాజర్, పడవల కృష్ణ (పండు) మర్రివాడ వినోద్, పడవల సుబ్బారావు పడవల నవీన్, కూనబత్తుల అయ్యప్ప, పులి శేఖర్, కూనపురెడ్డి మహేష్ పెద్ద ఎత్తున జనసైనికులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.