విలేక‌రిపై ఇసుక మాఫియా దాడి అమానుషం: పెంటేల బాలాజీ

చిల‌క‌లూరిపేట‌, రాష్ట్రంలో ఇసుక‌, మైనింగ్ దోపిడి య‌ద్దేచ్చ‌గా కొన‌సాగుతుంద‌ని, అధికారపార్టీ నేత‌లే మాఫియాగా మారి అడ్డుకున్న వారిపై దాడులు చేస్తున్నార‌ని జ‌న‌సేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజీ ఆరోపించారు. గురువారం త‌న కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో మాట్లాడుతూ అక్ర‌మ ఇసుక దందా విష‌యంపై ఫోటోలు తీస్తున్న అమ‌రావ‌తి విలేక‌రి తేలప్రోలు పరమేశ్వరరావుపై దాడి చేయ‌డాన్ని ఆయ‌న ఖండించారు. ఇది దుర్మార్గ చర్య. ఖచ్చితంగా జనసేన పార్టీ వారికి అండగా నిలబడుతుంద‌న్నారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు నిజమేనని కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిప‌టం అధికార పార్టీ నేత‌ల ఇసుక అక్ర‌మ వ్య‌వ‌హారం బ‌ట్ట‌బ‌య‌లు చేసింద‌న్నారు. ఇసుక దోపిడి గురించి జనసేన పార్టీ ఎప్పటి నుంచో పోరాటం చేస్తుంది. అడ్డుకున్న వారిని ఇలా భయబ్రాంతులకు గురి చేసి కేసులు పెడుతున్నారని, ఆరాచ‌క మూక‌లు భౌతిక దాడుల‌కు పాల్ప‌డుతున్నార‌ని మండిప‌డ్డారు. . వైఎస్సార్ సీపీ అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుంచి సామాన్యుల‌కు ఇసుక రేట్లు అంద‌ని అంత ఎత్తుకు పెరిగాయ‌ని, స‌రైన విధానం లేక‌పోవ‌డంతో అధికారంలో ఉన్న నాయ‌కుడు ఇసుకాబ‌కాసులుగా మారార‌ని విమ‌ర్శించారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో సామాన్యులకు ఇసుక ఎందుకు అందడం లేదో, ఇతర రాష్ట్రాలకు ఇసుక ఎందుకు తరలిపోతోందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పేదలకు లారీ ఇసుక అందించలేని ప్రభుత్వం. తమ నాయకుల జేబులు నింపేందుకు జిల్లాలు, నియోజకవర్గాల వారీగా వాటాలు పంచేసిందని ఆరోపించారు. ప్రభుత్వానికి ఆదాయం లేదు. అలాగని ఇసుక ఉచితం కాదు. ఆదాయం ప్రభుత్వ పెద్దలకు, వైసీపీ నేతలకు. భారం మాత్రం ప్రజలపైన వేయ‌డ‌మానా అని ప్ర‌శ్నించారు.