జనసేన విజయం ఖాయం

  • దక్షిణంలో బలోపేతమైన పార్టీ
  • పార్టీ అధినేత పవన్ స్ఫూర్తి తో పనిచేస్తున్న క్యాడర్
  • పార్టీ కు ప్రజల నుంచి విశేష స్పందన
  • నియోజకవర్గంలో కొనసాగుతున్న డాక్టర్ కందుల సేవలు

విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీ మెజార్టీ ఓట్లతో గెలుపొందడం ఖాయమని ఆ పార్టీ నియోజకవర్గ నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. బుధవారం నియోజకవర్గ పర్యటనలో భాగంగా నియోజకవర్గ పర్యటనలో భాగంగా 36వ వార్డు, సాలిపేటలో పుష్పవతి అయిన అమ్మాయి అమృతకు పట్టుబట్టలు, వెండి పట్టీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో పార్టీ క్యాడర్ పనిచేస్తుందని చెప్పారు.
నాయకుల నుంచి కార్యకర్తల వరకు అలాగే అభిమానుల సైతం పార్టీని గెలిపించాలని గట్టి పట్టుదలతో ఉన్నారని వెల్లడించారు. దక్షిణ నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతమైందని చెప్పారు. వచ్చే ఎన్నికలలో ఇక్కడ జనసేన పార్టీ సునాయాసంగా విజయం సాధించడం ఖాయమని స్పష్టం చేశారు. పార్టీ పటిష్టతకు తాను అహర్నిశలు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.