కిరప గ్రామంలో జనంలోకి జనసేన కార్యక్రమం 3వ రోజు

  • కిరప గ్రామంలో మంజూరు అవ్వని ఇల్లులను పరిశీలించిన జనసేన నాయకులు కూరంగి నాగేశ్వరావు

పాలకొండ నియోజకవర్గం: సీతంపేట మండలం కిరప గ్రామంలో పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కూరంగి నాగేశ్వరరావు (ఎస్ బిఐ రిటైర్డ్ మేనేజర్) పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇల్లులు మంజూరు అవ్వని గిరిజనులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూరంగి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. జనసేన టిడిపి ప్రభుత్వం వచ్చినంటనే మంజూరు అవ్వని గిరిజనుల ఇల్లులుపై సర్వే చేయించి ప్రత్యేక దృష్టి పెడతామని ఆయన హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే, ఇల్లులు మంజూరు అయ్యేటట్లు చర్యలు తీసుకుంటామని జనసేన నాయకులు కూరంగి నాగేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రమేష్, ఎస్. సుందర్ రావు సీతంపేట మండల అధ్యక్షులు మండంగి విశ్వనాథం పాల్గొన్నారు. పాలకొండ మండల జనసేన నాయకులు డొంపాక సాయి కుమార్ హాజరయ్యారు.