నెల్లూరు కార్పొరేషన్ స్పందనలో జనసేన వినతి

నెల్లూరు, సండే మార్కెట్ లైన్, లీలామహల్ సర్కిల్, గాంధీ బొమ్మ సెంటర్ నందుగల సిమెంట్ రోడ్లు ఏర్పాటుకు ముందు కట్టవలసిన సైడ్ కాలువలు మరియు డ్రైనేజీ వ్యవస్థ గురించి మరిచారంటూ జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ సోమవారం నెల్లూరు మున్సిపల్ కమిషనరేట్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగు ముఖాల సంవత్సరాలుగా అభివృద్ధిని ఆమడంత దూరంలో పడేసిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలనగానే ఉన్న ఫలానా హడావుడి చేస్తుంది. జనసేన-తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి మాజీ మంత్రి పొంగూరు నారాయణ గతంలో చేసిన అభివృద్ధి తప్ప ఇప్పటికి ఒక రోడ్డు కూడా వేసింది లేదు అని విమర్శల అనంతరం హడావుడిగా రోడ్లేస్తున్నారు. అవగాహన లోపంతో ఈ మధ్య లీలా మహల్ సెంటర్లో మరియు సండే మార్కెట్ సెంటర్లలో వేసిన రోడ్లు సైడ్ కాలువల నిర్మాణం జరగకుండా కనీసం డ్రైనేజీ హోల్సుకు ఆప్షన్ కూడా వదలకుండా వేసి తమ తెలుగు తక్కువ ప్రదర్శించారు. సండే మార్కెట్ వద్ద రోడ్డుకి ఇరువైపులా కనీసం అరడుగు ప్రవహించే కాలువ కూడా లేదు. దీనివల్ల చిన్నపాటి వానలకే చుట్టు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మునిగిపోయే పరిస్థితి ఉంది. అదేవిధంగా లీలా మహల్ సెంటర్లో అండర్ డ్రైనేజీని వ్యవస్థీకరీకరించకుండా పైన సిమెంటు రోడ్డు వేశారు.ఇక్కడ కూడా రేపు వానల విషయంలో డ్రైనేజీ కాలవల నీరంతా రోడ్లపై ప్రవహించే పరిస్థితి ఉంది. గాంధీ బొమ్మ వద్ద నగర ప్రధాన కూడలి చిన్నపాటి వానకే మరుగు నీరంతా మోకాలు లోతు చేరుతుంది. దీనికి కారణం మొదట గల అయిదారు షాపులు మాత్రమే డ్రైనేజీ సైడ్ కాలవల పై టాప్ ఎత్తే విధంగా ఏర్పాటు చేసుకొని ఉండగా 10మీటర్ల దాటిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా సిమెంట్ కాంక్రీట్ తో కాలువలు మూసివేయడం వల్ల అక్కడ పూడిక తీయకపోవడం వల్ల మరుగు నీరు ప్రవహించకుండా అలాగే నిలువ ఉండి దోమలు రోగాలకు కారణం అవుతున్నాయి. వీటన్నిటిని నివారించవలసిందిగా కమిషనర్ ని కోరడం జరిగింది. ఆయా ప్రాంతాల ఇన్స్పెక్టర్ను పిలిచి విచారించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా తెలిపారు. దశాబ్దాలు గడిచిన ఈ మరుగు నీరు మాత్రం నగరం నడిబొట్టులో ప్రవహించే విధంగా అసహ్యమైన పరిస్థితి ఉంది. దీని మీద చర్యలు తీసుకోపోతే జనసేన పార్టీ తరఫున పోరాటం చేసి వ్యవస్థ కాలవలు డ్రైనేజీ వ్యవస్థను నవీకరించే వరకు నిరసనలు ప్రదర్శిస్తామని తెలిపారు. ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేయగల పొంగూరి నారాయణ విజయం ఈ రోజు మన నెల్లూరు పట్టణ వాసులకి ఎంతో అవసరమని గుర్తు చేశారు. అండర్ డ్రైనేజీ, సిమెంట్ రోడ్లు మరియు మినరల్ వాటర్ ప్రజలకందే విధంగా గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు చేసిన సేవలను గుర్తించి అందరూ కూడా ప్రజా ప్రభుత్వ అభ్యర్థి పొంగూరు నారాయణకి ఓటు వేసి గెలిపించాల్సిందిగా పిలుపునిచ్చారు. అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా అభివృద్ధికి అవకాశం ఇచ్చే అభ్యర్థులకే ప్రజా మన్ననలు ఉన్న అభ్యర్థులకే మక్కువ చూపే విధంగా ఎంపిక చేసారని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆశయాల అనుగుణంగా నిలబడిన ఈ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత ఉందని కూడా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, పట్టణ కార్యదర్శి హేమచంద్ర యాదవ్, షాజహాన్, బన్నీ, వరా, బాలు తదితరులు పాల్గొన్నారు.