జనసేన కార్యాలయ సిబ్బందిపై దాడులు హేయమైన చర్య

  • పత్తికొండ నియోజకవర్గ జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సిజి రాజశేఖర్

పత్తికొండ: మంగళగిరి జనసేన సిబ్బంది నివసించే అపార్ట్మెంట్లో పోలీసులు సోదాలు చేసి మా వాళ్లను భయభ్రాంతులకు గురిచేసినటువంటి పోలీసుల చర్యను పత్తికొండ నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. పత్తికొండ నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యాలయం నందు జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సిజి రాజశేఖర్ మాట్లాడుతూ.. మంగళగిరి ప్రాంతంలో జనసేన పార్టీకి పని చేసే సిబ్బంది నివసించే అపార్ట్ మెంట్లో పోలీసులు సోదాలు చేయడం కక్ష సాధింపు చర్య. వారి గదుల్లోకి వెళ్ళి ఎలాంటి కారణం చెప్పకుండా భయభ్రాంతులకు గురి చేసే విధంగా పోలీసుల వ్యవహార శైలి ఉంది. ఈ తీరు చూస్తే కచ్చితంగా పోలీసులను ఉపయోగించి సిబ్బందిని, తద్వారా జనసేనను వేధించాలనే దురాలోచనతోనే వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది అనిపిస్తోంది. రాత్రి 10 గం.లకు రావాల్సిన అవసరం ఏమిటి? ఏ సమాచారం ఆధారంగా చేసుకొని అక్కడికి వచ్చారో చెప్పాలి. జగన్ రెడ్డి మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. మీరు పోలీసు వారి చేత అణిచివేయాలని చేసే ఆలోచన పద్ధతి కాదు, మీకు చేతనైతే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం, మరో 50 రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి ప్రజలే తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కావున మీరు ఓడిపోతారని మీకు తెలిసి పోలీసు వారి చేత భయప్రాంతల గురిచేయడం సిగ్గుచేటు అని తెలియజేశారు. అలాగే
పోలీసు వారు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి అధికారం ఎవరికి శాశ్వతం కాదు, మీరు నీతి నిజాయితీగా న్యాయం వైపు నిలబడాలి కానీ వైసీపీ చేస్తున్న రాజకీయ కక్ష సాధింపులకు పోలీసులు పావులుగా మారడం అప్రజాస్వామికం. ఈ చర్యలను ప్రతి ప్రజాస్వామికవాది ఖండించాలి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు గల్లా రామచంద్ర, బెందెల సుధాకర్, ఇస్మాయిల్ వడ్డే వీరేష్ ఎర్రి స్వామి, చాంద్ బాషా ఆమదాల రంగస్వామి, ఎదురింటి రాజశేఖర్, అభిరామ్, అనిల్, కోసి భార్గవ్ మరియు తదితరులు పాల్గొన్నారు.