కెనడాలో ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

  • టొరొంటో, వాంకోవర్ నగరాల్లో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కెనడా: పవన్ కల్యాణ్ గారి అశయాలను అర్ధం చేసుకుంటూ ఎప్పుడూ జనసేనాని వెంటే నడిచే కెనడా జనసేన టీం ఈ 11వ జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ముందుగానే ఈ వారంతంలో మార్చి 9వ తారీఖున టొరొంటో మరియు వాంకోవర్ నగరాల్లో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దలు, యువకులు, మహిళలు, పిల్లలు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. ఇప్పటిదాకా సాగిన కెనడా జనసేన టీం ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు, అలాగే ఈ 2024 ఎలక్షన్స్ కి మరింత బలంగా జనసేన పార్టీకి అండగా నిలబడాలి అని నిర్ణయంతీసుకున్నారు. పొత్తులు ఎవరితో, ఎన్ని సీట్లు జనసేనకి కేటాయించారు అనే దానికంటే రాష్త్రానికి మంచి జరగాలి అనే జనసేనాని వ్యూహమే మాకు ముఖ్యం, మా భవిష్యత్ మాత్రమే మాకు ముఖ్యం అని ముక్త కంఠంతో పవన్ కల్యాణ్ గారితోనే మా అడుగులు ప్రమాణం చేసారు. ఈ సారి ఎన్నికలకు ప్రత్యర్ధి పార్టీలు సిద్ధం అని ప్రకటిస్తే, ఈ అవినీతి రాక్షస ప్రభుత్వాలను ఎదుర్కొనడానికి మేము కూడా యుద్ధానికి సిద్ధం అని కెనడా జనసేన టీం నిర్ణయించుకున్నారు.