ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, చింతూరు మండల అధ్యక్షులు మడివి రాజు ఆధ్వర్యంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు మరియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లీగల్ సెల్ ఉపాద్యక్షులు కాకి స్వామి ముఖ్య అతిథిగా జండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో మండల నాయకులు పయ్యాల నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు తీగల రవి, మరో ఉపాధ్యక్షులు చిలకం కన్నరావు, దేవిపట్నం మండల అధ్యక్షులు చారపు వెంకట రాయుడు, చోడవరం ఉపాధ్యక్షులు రాగాల సురేష్, సీనియర్ నాయకులు చుప్పల కన్నబాబు పాల్గొన్నారు.