వ్యాక్సిన్ సర్టిఫికేట్ల పై మోడీ ఫోటో తొలగించండి

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ ఫోటోను కరోనా వైరస్ టీకా సర్టిఫికేట్లపై తొలగించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో మోడీ ఫోటోలు ఉన్న ద్రువపత్రాలను ఇవ్వరాదు అని ఈసీ చెప్పింది. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొన్నది. అయితే మిగితా అన్ని రాష్ట్రాల్లో మోడీ ఫోటో ఉన్న సర్టిఫికేట్లను ఇవ్వవచ్చు అని ఈసీ వెల్లడించింది.

మార్చి ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా కరోనా టీకా ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే. కేంద్ర ఆరోగ్య శాఖ ఇస్తున్న సర్టిఫికేట్లపై మోడీ ఫోటో ఉంటోందని, డాక్టర్లు,-నర్సులు-హెల్త్‌కేర్ వర్కర్ల నుంచి ప్రధాని క్రెడిట్ కొడుతున్నారని ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. డాక్టర్లు, నర్సుల నిస్వార్థ సేవలను దుర్వినియోగం చేస్తున్నారని తృణమూల్ ఎంపీ డెరిక్ ఆరోపించారు. పెట్రోల్ బంకుల్లో మోడీ హోర్డింగ్‌లను తీసివేయాలని ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే.