నకిలీ ఇళ్ళ పట్టాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి: పంతం నానాజీ

కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో నకిలీ ఇళ్ళ పట్టాలపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని మీడియా ముఖంగా కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన, టీడీపి & బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి పంతం వెంకటేశ్వర రావు (నానాజీ) అధికారులను కోరడం జరిగింది. నకిలీ ఇళ్ళ పట్టాలు ఇచ్చి ప్రజలను స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు ప్రలోభాలకు గురి చేస్తున్నారని, స్థానిక వైసీపీ నాయకులు కొన్ని వేల డూప్లికేట్ పట్టాలు పంపిణీ చేస్తున్నారని, స్వామి నగర్ గ్రామంలో ఎటువంటి పట్టాలు పంపిణీ చేయలేదని ఆర్.టి.ఐ ద్వారా కాకినాడ రూరల్ ఎమ్మర్వో కార్యాలయం తెలిపిందని, కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలని వారి దగ్గర ఉన్న పట్టాలను ఆర్.డి.ఓ, ఎమ్మర్వో కార్యాలయాలకు వెళ్లి పరిశీలించుకోవాలని, జర్నలిస్టుగా పనిచేసి ఎమ్మెల్యే అయిన వైసీపీ నాయకుడు ఇంతలా దిగజారిపోవడం దారుణమని, కాకినాడ రవల్ నియోజకవర్గంలో సుమారు 6,000 (ఆరు వేల) డబుల్ ఎంట్రీస్, మరణించిన వారి ఓట్లను తొలగించకపోవడం ఇదంతా అధికారాన్ని స్థానిక వైసీపీ ఎమ్మెల్యే దుర్వినియోగం చేస్తున్నారని పంతం నానాజి అన్నారు. ఈ సమావేశంలో ఎల్దుటి లక్ష్మి నారాయణ, పాలిక రమణ, భోగి రెడ్డి కొండబాబు, అద్దంకి వీరబాబు, గవర శ్రీరాములు, దొడ్డిపట్ల అప్పారావు, తాటిమళ్ళ రమేష్, కండెపల్లి వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.