మెట్లకోనేరులో ప్రజాగళం

ఏలూరు, జే బ్రాండ్ మద్యం అమ్మకాల కోసం మద్యం షాపుల వద్ద టీచర్లు, వీఆర్వోలను నిలబెట్టిన జగన్ వారి ద్వారా పెన్షన్ల పంపిణీకి ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ జనసేన-టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్ధి బడేటి చంటి, ఏలూరు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్ధి పుట్టా మహేష్ కుమార్ యాదవ్, జనసేన ఇంఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. ఏలూరు 48వ డివిజన్ మెట్లకోనేరు వద్ద వినాయక స్వామి గుడి వద్ద నిర్వహించిన ప్రజాగళం సభలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుట్రపూరితంగానే వైసీపీ ప్రభుత్వం ఫెన్షన్లు జాప్యం చేసి, ప్రతిపక్షాలపై నిందలు వేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. అయితే ఈ విషయంలో వైసీపీ నేతలు చేస్తోన్న దుష్ప్రచారాలను ప్రజలు మ్మేస్థితిలో లేరన్నారు. అవ్వా, తాతలకు ఇవ్వాల్సిన పెన్షన్ సొమ్మును తమ తాబేదారులకు దొడ్డిదారిన పంచిపెట్టిన జగన్మోహన్ రెడ్డి ఖజానా మొత్తాన్ని ఊడ్చేసి, ఎన్నికలకు ముందు గ్లోబెల్స్ ప్రచారానికి తెరలేపారని వారు మండిపడ్డారు. సచివాలయ సిబ్బంది, సెర్ప్ సిబ్బంది, వీఆర్వోలతో పెన్షన్ పంపిణీకి ఎందుకు చర్యలు తీసుకోలేదో సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేస్తోన్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన బుద్ది చెప్తారని వారు హెచ్చరించారు. కూటమికి వస్తోన్న ప్రజాదరణను చూసి ఓర్వలేక అధికార పార్టీ నాయకులు విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఈవిఎంలోని బటన్ నొక్కి సీఎం జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు ఏలూరు జనసేన పార్టీ నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, రెడ్డి గౌరీ శంకర్, సరిది రాజేష్, వీరంకి పండు, నూకల సాయి, అల్లు సాయి చరణ్, బొత్స మధు, ఎట్రించి ధర్మేంద్ర, పైడి లక్ష్మణరావు, కందుకూరి ఈశ్వరరావు, జనసేన రవి, కలపల్లి కృష్ణ, వీరమహిళలు కావూరి వాణిశ్రీ, కొసనం ప్రమీల, తుమ్మపాల ఉమా దుర్గ, కుర్మా సరళ, గాయత్రి మరియు వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం-జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు.