వైసిపి పార్టీ నుంచి అత్యధికంగా మా పార్టీలో చేరటం చాలా సంతోషకరం: గాదె

పెదకూరపాడు నియోజకవర్గం, క్రోసూరు మండలం, గాదె వారిపాలెంలో వైయస్సార్ పార్టీ నుండి జనసేన పార్టీలోకి ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వర రావు సమక్షంలో పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త యర్రం శెట్టిరామకృష్ణ, ఐటీ విభాగం నాయకులు సుధా సాంబశివరావు, క్రోసూరు మండల పార్టీ అధ్యక్షులు నాగేశ్వరావుల ఆధ్వర్యంలో 30 కుటుంబాలు గుంటూరు జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో చేరట జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ శిఖా బాలు, జిల్లా ప్రోగ్రాం కమిటీ మెంబర్ శాఖమూరి శ్రీనివాసు, బయ్యవరం గ్రామ ఉపసర్పంచ్ తలారి కోటేశ్వరరావు, మాదాసు అప్పారావు, గాదె వారిపాలెం గ్రామ పార్టీ అధ్యక్షులు గాదె రామకోటేశ్వరరావు, సిద్దయ్య, మాజీ సర్పంచ్ దండే పోయిన పిచ్చయ్య, నరసింహారావు, వెంకట్రావు,మరియు గ్రామ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగినది రాబోయే రోజుల్లో శక్తివంచను లేకుండా జనసేన పార్టీ అడ్డాగా మారుస్తామని మండలంలో జనసేన పార్టీకి ఆదర్శంగా మా గ్రామాన్ని నిలుపుతామని గ్రామ పార్టీ నాయకులు స్పష్టం చేయడం జరిగింది.