అంగరంగ వైభవంగా సాగిన బోనెల విజయ్ చంద్ర ప్రచార యాత్ర

  • భారీ సంఖ్యలో హాజరైన పెదమరికి, చిన్నమరికి, గ్రామ ప్రజలు

పార్వతీపురం మండలం, పెద్దమరికి, చినుమరికి గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వివరాల్లోకి వెళితే పార్వతీపురం నియోజకవర్గం జనసేన, తెలుగుదేశం, బిజెపి ఉమ్మడి అభ్యర్థి బోనెల విజయ్ చంద్ర ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమానికి హాజరైన బోనెల విజయ చంద్ర రాకతో సందడి వాతావరణం నెలకొంది పెదమరికి, చినమరికి, గ్రామంలో భారీగా చేరుకున్న జనసేన-టిడిపి- బిజెపి కార్యకర్తలు నాయకులు, ఇంటింటికీ వస్తున్న విజయ్ చంద్ర గారికి మంగళహారతి ఇస్తూ పూలమాలలు వేస్తూ నినాదాలతో మహిళలు ప్రజానీకం విజయ తిలకం దిద్ది ముందుకు తీసుకెళుతున్న పెదమరికి, చినమరికి, గ్రామ ప్రజలు చంద్రబాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో అంశాలను ప్రజానీకానికి వివరిస్తుా ముందుకు నడిచిన విజయ చంద్ర గారితో పాటు నడిచిన జనసేన పార్టీ పార్వతిపురం మండల అధ్యక్షురాలు ఆగూరు మని, జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి చిట్లు గణేశ్వరరావు, జనసేన వీర మహిళ బోనిల గోవిందమ్మ, అన్న బత్తుల దుర్గాప్రసాద్, సంతు, గుంట్రెడ్డి గౌరీ శంకర్, విశ్వేశ్వరరావు, కనకరాజు, భాస్కర, కర్రి మణికంఠ, రాజు,*ముఖ్యంగా పెదమరికి, చినమరికి, కొత్తూరు, గ్రామ జనసేన పార్టీ నాయకులు కి ధన్యవాదాలు, అడ్డాల నవీన్, బండపల్లి జనార్దన్ (జానీ)శరత్, పువ్వుల తాతబాబు, రవి, జనసేన కార్యకర్తలు, టిడిపి నాయకులు, కార్యకర్తలు, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.