సేవాఘడ్ లో బంజారా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి: కమల్ సింగ్ రాథోడ్

*కేంద్ర మంత్రి శోభా కరండ్లజె కు కమల్ సింగ్ రాథోడ్ విన్నపం

గురువారం జిల్లా కేంద్రంలోని కురుగుంట సేవాలాల్ కాలనీలో బంజారా ప్రజలు ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్న కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శోభా కరండ్లజెకు బంజారా ఫౌండేషన్ ఛైర్మన్ కమల్ సింగ్ రాథోడ్ ప్రత్యేక డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

18 కోట్ల బంజారా ఆరాధ్యదైవం సేవాలాల్ జన్మస్థలం సేవాఘడ్ లో బంజారా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరారు. అంతేకాకుండా ప్రత్యేక సంసృతి వేషధారణ కలిగిన బంజారాల భాషను 8వ షెడ్యూల్ లో చేర్చాలని తెలిపారు. సేవాలాల్ జయంతిని సెలవుదినంగా ప్రకటించి.. జయంతి వేడుకలను అధికారికంగా జరుపుతూ.. బంజారా సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డ్ ఏర్పాటు చేసి 100 కోట్లను విడుదల చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టి రైతులకు 100 శాతం సబ్సిడీతో డ్రిప్, అధునాతన వ్యవసాయ పనిముట్లను మంజూరు చేయాలని బంజారా ప్రముఖులు కేశవ్ నాయక్, జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షులు రంజిత్ చౌహాన్, తులసీదాసు నాయక్, గీతా బాయి, భారత్ నాయక్ తదితరులు తెలిపారు.