ఆస్ట్రాజెనికా టీకాలోని ఓ బ్యాచ్‌ను నిలిపివేసిన ఆస్ట్రియా

జురిచ్‌: కరోనా నివారణకు అభివృద్ధి చేసిన ఆస్ట్రాజెనికా టీకా వినియోగాన్ని ఆస్ట్రియా అధికారులు నిలిపి వేశారు. టీకాలను తీసుకున్న తర్వాత వ్యక్తి మరణించడంతో పాటు మరొకరు అనారోగ్యం బారిన పడిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా టీకాలోని ఓ బ్యాచ్‌ను నిలిపివేసినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దిగువ ఆస్ట్రియా ఫ్రావిన్‌లోని జ్వెట్ల్‌ జిల్లా క్లినిక్‌లో ఆస్ట్రాజెనికా ఒకే బ్యాచ్‌కు చెందిన టీకాలతో ఈ సమస్యలు వచ్చినట్లు ఫెడరల్‌ ఆఫీసర్‌ ఫర్‌ సేఫ్టీ ఇన్‌ హెల్త్‌ కేర్‌కు నివేదికలు రావడంతో వాటిని వినియోగాన్ని నిలిపివేశారు. టీకా తీసుకున్న తర్వాత 49 ఏళ్ల మహిళ మృతి చెందగా… మరో మహిళ తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఓ బ్యాచ్‌ టీకాల వాడుకను నిలిపి వేసి… అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.