నవాబు పేట కాలనీలో ప్రజా సంకల్ప యాత్ర

  • 3వ డివిజన్ నవాబు పేట కాలనీలో జరిగిన ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొన్న ఉమ్మడి కూటమి అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య చంటి, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు, మాజీ ఊడ చైర్మెన్ మధ్యాహ్నపు బలరాం..

ఏలూరు: ఐదేళ్ళ పాటూ అరాచకాలు, విధ్వంసాలతో రాష్ట్రంలో రాక్షస పాలన సాగించిన వైసిపి ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడం ఖాయమని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి, జనసేన, బీజేపి కూటమి ఉమ్మడి అభ్యర్ధి బడేటి చంటి ధీమా వ్యక్తం చేశారు.. ఏలూరు నియోజకవర్గం 3వ డివిజన్‌ పరిధిలోని నవాబు పేట కాలనీలో ఆయన ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు మరియు మాజీ ఊడ చైర్మెన్ మధ్యాహ్నపు బలరాం తో కలిసి సంకల్పయాత్రను నిర్వహించారు.. జనసేన ఇన్‌ఛార్జ్‌ రెడ్డి అప్పలనాయుడు, టిడిపి నాయకులు మధ్యాహ్నపు బలరాంతో కలిసి సంకల్పయాత్రలో పాల్గొన్న బడేటి చంటి ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రజలను కలుసుకుని, ఈ ఎన్నికల్లో కూటమి ఎందుకు విజయం సాధించాలో వివరించారు.. కూటమి అధికారంలోకి వస్తే అమలు చేసే సూపర్‌ సిక్స్‌ పథకాలను వివరిస్తూ, కరపత్రాలను పంపిణీ చేశారు..ఈ సంకల్ప యాత్రలో వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం, బిజెపి పార్టీల నాయకులతో పాటు ఏలూరు నియోజకవర్గ జనసేన నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతి కుమార్, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, కార్యదర్శులు కందుకూరి ఈశ్వరరావు, బొత్స మధు, ఎట్రించి ధర్మేంద్ర, కోశాధికారి పైడి లక్ష్మణరావు, మీడియా ఇంచార్జ్ జనసేన రవి, వీరమహిళలు కావూరి వాణిశ్రీ, కొసనం ప్రమీల, గాయత్రి, తుమ్మపాల ఉమా దుర్గ, గుదే నాగమణి, నాయకులు రెడ్డి గౌరీ శంకర్, నూకల సాయి ప్రసాద్, బోండా రాము నాయుడు, బుధ్ధా నాగేశ్వరరావు, గొడవర్తి నవీన్, కురెళ్ళ భాస్కర్, సోషల్ సర్వీస్ మురళి, నిమ్మల శ్రీనివాసు భారీ సంఖ్యలో జనసేన, తెలుగుదేశం, బిజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.