అంబేడ్కర్ ఆశయాలు అనుచరణీయం

  • జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య

రాజంపేట: అంబేడ్కర్ ఆశయాలు అనుచరణీయమని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పేర్కొన్నారు. మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో ఆదివారం భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని రాటాల రామయ్య అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాటాల రామయ్య ఆయన మాట్లాడుతూ.. అంటరాని అణగారిన వర్గాలు రాజ్యాంగం రచించడంలో అంబేడ్కర్ ప్రధాన పాత్ర పోషించారన్నారు. అంబేడ్కర్ యొక్క ఆశయాలను సిద్ధాంతాలను గౌరవిస్తూ, రాజకీయ పార్టీలు నడుపుతున్న కొంతమంది నాయకుల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముందుంటారన్నారు. అణగారిన వర్గాలు ఇప్పటివరకు రాజ్యాధికారం పొందని వర్గాలకు మంచి జరగాలంటే జనసేన, టిడిపి బిజెపి, ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.