అవకాశమివ్వండి- అభివృద్ధి చేసి చూపిస్తా

  • ఉమ్మడి పార్టీల కూటమి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయక్రిష్ణ

పాలకొండ: నాకు ఒక్కసారి అవకాశమివ్వండి.. అభివృద్ధి చేస్తానని, మండలంలోని వలసలు నివారణకు ప్రత్యేక ఉపాధి కేంద్రాలను ఏర్పాటు చేస్తానని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం మండలం బిల్లుమడ గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ఇంటింటా చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు, వృద్దులు, యువత తాము ముందే నిర్ణయం తీసుకున్నామని కూటమి గెలిస్తే.. ఉపాధి అవకాశాలు కల్పిస్తారని, అందుకే గాజు గ్లాసుకు ఓటు వేస్తామని చెప్పడంతో జయకృష్ణ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈయన వెంట జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనరు నిమ్మల ఇబ్రం, భామిని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బోగాపురపు రవినాయుడు, మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మెడిబోయిన జగదీశ్, టీడీపీ మాజీ ఎంపీపీ భూపతి ఆనంద రావు, భామిని మండల జనసేన పార్టీ అధ్యక్షులు రంకు కిరణ్, స్థానిక నాయుకులు భూష సూర్యారావు, బర్రి కాశిరావు, బి ప్రసాద్, కాంతారావు, రామరాజు, మరియు జనసేన, తెలుగుదేశం, బిజేపీ నాయకులు పాల్గొన్నారు.