లక్ష్మనేశ్వరం గ్రామంలో జనసేన పార్టీలో చేరికలు

నరసాపురం నియోజకవర్గం: జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి నరసాపురం నియోజవర్గం లక్ష్మనేశ్వరం గ్రామం, జోననగర్ లో సిర్ర సామ్యూల్ దిగమర్తి అశోక్ బాలం తిమోతి బాలం సుమన్ బాలం దినేష్ గెద్దాడ నాని దిగమర్తి సుధీర్ ఉల్లంపర్తి రవి అయినవుడి శేఖర్ పాకర్ల నవీన్ గొర్ల సురేష్ దిగమర్తి జీవన్ రాజ్ తెన్నేటి నవీన్ బాలం బాబి దిగమర్తి పౌలు ఉల్లంపర్తి నాని మరియు దాదాపుగా 50 మంది టిడిపి బిజెపి పార్టీలు బలపరిచిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు వారందరికీ నాయకర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజవర్గ జనసేన, టిడిపి, బిజెపి నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.