విశాఖ ఉక్కు పరిరక్షణకు జనసేన పార్టీ ఎప్పుడు పోరాడుతుంది

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన విశాఖ ఉక్కు పరిరక్షణకు జనసేన పార్టీ పోరాడుతుందని తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు లిఖితపూర్వకంగా లెటర్ ఇవ్వడం, అలాగే అక్టోబర్ 31న కుర్మన్నపాలెంl(గాజువాక) లక్షల మందితో భారీ బహిరంగ సభ ద్వారా, అలాగే డిసెంబర్ 12న విజయవాడ మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో లో ఒక రోజు నిరాహార దీక్ష , ఇప్పుడు 18,19,20 తేదీల్లో డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించాలని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. డిజిటల్ క్యాంపెయిన్లో భాగంగా MPలు తమ బాధ్యతలు తెలుసుకొని ప్రజల పక్షాన పార్లమెంట్లో ప్లే కార్డ్స్ పెట్టి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నారని MP లు తెలియజేయాలని ఈరోజు జనసేన పార్టీ అన్ని నియోజకవర్గాల్లో నిరసన తెలియజేస్తున్నారు.. నిరసనలో భాగంగా గాజువాక కూర్మన్నపాలెం ఉక్కు పరిరక్షణ సమితి నిర్వాసితుల దీక్షలో పాల్గొని నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గడసాల అప్పారావు, పిలా రామకృష్ణ, కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి, జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.