ఎన్నికల సరళని పరిశీలించిన అంకె ఈశ్వరయ్య

అనంతపురం పార్లమెంటు టిడిపి జనసేన బిజెపి కూటమి అభ్యర్థి అంబిక లక్ష్మీనారాయణ తరపున చీఫ్ ఎలక్షన్ ఏజెంట్, జనసేన జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య పార్లమెంట్ పరిధిలో సోమవారం జరిగిన ఎన్నికల సరళిని పరిశీలించారు. ముందుగా సింగనమల, అనంతపురం, రాయదుర్గం కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి అని ఈశ్వరయ్య క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. ఆయన వెంట రాయదుర్గం జనసేన ఇంచార్జ్ మంజునాథ్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, కళ్యాణదుర్గం నియోజకవర్గం సమన్వయకర్త బాల్యం రాజేష్, నరసయ్య, రంజిత్, దావూద్ తదితరులున్నారు.