‘అమృత్‌ మహోత్సవ్‌’కు మోదీ శ్రీకారం

న్యూఢిల్లీ: 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమానికి ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వెబ్‌సైట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఆగస్టు 15 వరకు 75 వారాల పాటు చేపట్టాలని మోడీ పిలుపునిచ్చారు. దండియాత్ర ప్రారంభించి 91 ఏళ్లు గడిచిన సందర్భంగా సబర్మతిలో గాంధీ ఆశ్రమాన్ని సందర్శించిన ఆయన ..దండి వరకు సాగే 241 కి.మీ పాదయాత్రను ప్రారంభించారు. 81 మందితో ప్రారంభమై 25 రోజుల పాటు సాగి.. ఏప్రిల్‌ 5న ఈ పాదయాత్ర ముగియనుంది. ఈ యాత్రకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ నేతృత్వం వహించనున్నారు. ఈ సందర్భంగా మోడీ ప్రసంగించారు.