నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ

న్యూఢిల్లీ : బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ శనివారం సమావేశం కానుంది. ఈ సందర్భంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ‘నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల పేర్లపై చర్చించేందుకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ రేపు సమావేశం నిర్వహించనుంది’ అని పేర్కొన్నారు. అసోంలో ముగ్గురు అభ్యర్థుల పేర్లను బీజేపీ బుధవారం ప్రకటించింది. అదేవిధంగా పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి రెండు దశలకు 60 మంది అభ్యర్థుల జాబితాను ఇంతకు ముందు విడుదల చేసింది. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, అసోం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని 824 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు పలు విడతల్లో జరుగనుండగా.. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి. 2.7లక్షల పోలింగ్‌ కేంద్రాల్లో 18.68 మంది కోట్ల ఓటర్లు ఓటువేయనున్నారు.