దేశంలో ఉత్తమ డీజీపీగా గౌతమ్ సవాంగ్… అభినందించిన సీఎం జగన్

ఏపీ పోలీస్ విభాగం ఖ్యాతి దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. అత్యుత్తమ స్థాయిలో సేవలు అందిస్తున్నందుకు ఒకే రోజు 13 అవార్డులు ఏపీ పోలీస్ డిపార్ట్ మెంట్ ను వరించాయి. అన్నింటికి మించి దేశంలోనే ఉత్తమ డీజీపీగా రాష్ట్ర పోలీస్ బాస్ గౌతమ్ సవాంగ్ ఎంపికయ్యారు.

సీఎం జగన్ ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిసిన డీజీపీ తన సంతోషాన్ని పంచుకున్నారు.ఈ సందర్భంగా గౌతమ్ సవాంగ్ ను ఏపీ సీఎం జగన్ అభినందించారు. జాతీయ స్థాయిలో ఏపీ పోలీస్ విభాగాన్ని అగ్రస్థానంలో నిలిపినందుకు సవాంగ్ ను కొనియాడారు. స్మార్ట్ విధానాలతో ఇతర రాష్ట్రాల పోలీసులకు ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. సీఎం అభినందనలకు డీజీపీ సవాంగ్ కృతజ్ఞతలు తెలిపారు.