చెర్రీ బర్త్ డే: ఫ్యాన్స్ కు ట్రిపుల్‌ ట్రీట్‌.. రంగంలోకి ”RRR, ఆచార్య” టీమ్స్!

మార్చి 27 మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే. ఈ స్పెషల్ డేను.. వెరీ వెరీ స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు మెగా ఫ్యాన్స్‌. ఇందులో మేము సైతం అంటున్నాయి ”RRR, ఆచార్య” టీమ్స్. అందరూ కలిసి బర్త్ డే వేడుకలను బంబాట్ గా జరిపేందుకు ప్లాన్ గీస్తున్నారు.

రామ్ చరణ్ బర్త్ డేను పురస్కరించుకొని ఒక రోజు ముందు.. అంటే మార్చి 26న పార్టీ ప్లాన్ చేశారు మెగా ఫ్యాన్స్. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికను ఈ బర్త్ డే పార్టీకి వేదికగా చేసుకుంటున్నారు. ఫ్యాన్స్ అంతా ఒక్కచోట చేరి సంబరాలు చేసుకునేందుకు స్కెచ్ గీస్తున్నారు.

ఇక, ఈ అకేషన్ ను సినిమా ప్రమోషన్ కు ఉపయోగించుకునేందుకు ఇటు ‘RRR’ బృందం.. అటు ‘ఆచార్య’ టీమ్ కూడా రంగంలోకి దిగుతున్నాయి. చెర్రీ బర్త్ డే సందర్భంగా అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించిన రౌద్ర రూపాన్ని ప్రదర్శించబోతున్నట్టు ప్రకటించింది జక్కన్న బృందం. చెర్రీ ఫస్ట్ లుక్ తో కేక పెట్టించడానికి సిద్ధమైంది.

మరోవైపు ఆచార్య టీమ్ కూడా ‘సిద్ధ’ను జనాలకు పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది. బర్త్ డే రోజునే రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తండ్రి చిరు ఆచార్యగా కనిపిస్తుండగా.. రామ్ చరణ్ సిద్ధగా దుమ్ములేపబోతున్న విషయం తెలిసిందే.

ఈ విధంగా రామ్ చరణ్ బర్త్ డేను ధూమ్ ధామ్ గా సెలబ్రేట్ చేయడానికి అటు ఫ్యాన్స్‌.. ఇటు రెండు చిత్రాల టీమ్ లు సిద్ధమయ్యాయి. దీంతో.. అభిమానులకు ట్రిపుల్ ట్రీట్ అందబోతోందన్నమాట.