ప్రారంబమైన ‘బిగ్ బాస్ 4’ సందడి

ప్రపంచ టెలివిజన్ చరిత్రలోనే అతిపెద్ద రియాలిటీ షోగా చెప్పుకునే ‘బిగ్ బాస్’ షో కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అయితే కరోనా వైరస్ కారణంగా నాలుగో సీజన్ కాస్త ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్ బాస్ సీజన్ 4 హంగామా ఆదివారం సాయంత్రం 6 గంటలకు మొదలైంది.

నాగార్జున ఎప్పటిలానే అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. ఆయన సినిమాల్లోని పాటలకు స్టెప్పులేశారు. అయితే ప్రోమోలో చూపించినట్టు నాగార్జున డబుల్ రోల్ ఫాదర్ లుక్ లో స్టేజ్ పైకి వచ్చి, సరికొత్త బిగ్ బాస్ సెట్లోకి వెళ్లి అందరికీ సెట్ ని పరిచయం చేశారు.. తన స్టైల్లోనే పంచ్‌లు, చమత్కారాలతో అలరించారు.

కరోనా ఫీల్ నుంచి బయటకి తెస్తూ, అందరికీ ఊపు వచ్చేలా కింగ్ నాగార్జున సాంగ్స్ మాషప్స్ తో ఎంట్రీ చాలా గ్రాండ్ గా డిజైన్ చేశారు.. అనంతరం కంటెస్టెంట్లు బిగ్ బాస్ సెట్లోకి వరుసగా ఎంట్రీ ఇచ్చారు.

తమన్నా బాంగ్ బాంగ్ సాంగ్ తో ఫస్ట్ కంటెస్టెంట్ మోనాల్ గజ్జర్ ఎంటర్ అయ్యింది..

సినీ హీరోకి వేసే ఓ ఏవీ స్టైల్ లో డైరెక్టర్ సూర్య కిరణ్(సత్యం ఫేమ్) రెండవ కంటెస్టెంట్ గా ఎంటర్ అయ్యాడు.

స్టార్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న లాస్య మూడవ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యింది.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ అభిజీత్ నాల్గవ కంటెస్టెంట్ గా బిగ్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యాడు.

టీవీ యాంకర్ గా బాగా ఫేమస్ అయిన జోర్దార్ సుజాత ఐదవ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది.

టిక్ టాక్ మరియు యూట్యూబ్ ద్వారా బాగా ఫేమస్ అయిన మెహబూబ్ దిల్సే ఆరవ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యాడు.

మోస్ట్ ఫెమస్ టీవీ ఛానల్ న్యూస్ రిపోర్టర్ దేవీ నాగవల్లి ఏడవ కంటెస్టెంట్ గా, లేడీ బిగ్ బాస్ అవ్వాలంటూ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవుతుంది.

యూట్యూబ్ ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ దేత్తడి హారిక 8వ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యింది.

సినిమా మరియు సీరియల్ యాక్టర్ సయ్యద్ సోహైల్ 9 కంటెస్టెంట్ గా ఎంటర్ అయ్యాడు.

సినిమా మరియు సీరియల్ యాక్టర్ సయ్యద్ సోహైల్ 9 కంటెస్టెంట్ గా ఎంటర్ అయ్యాడు.

యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫెమస్ అయినా యాంకర్ అరియనా గ్లోరీ 10వ కంటెస్టెంట్ గా ఎంటర్ అయ్యింది.

సౌత్ లో అందరికీ పరిచయం ఉన్న కొరియోగ్రాఫర్ మరియు డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ 11వ కంటెస్టెంట్ గా రాకింగ్ పెర్ఫార్మన్స్ తో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు..

సినీ నటి కరాటే కళ్యాణ్ 12వ కంటెస్టెంట్ గా ఎంటర్ అయ్యి, ఓ హరికథతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యింది.

13వ కంటెస్టెంట్ గా తెలుగు సింగర్ అండ్ రాపర్ అయిన నోయెల్ అదిరిపోయే బిగ్ బాస్ రాప్ సాంగ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యాడు.

మోడలింగ్ లో సూపర్ సక్సెస్ అయ్యాక నటిగా ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్న దివి 14వ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యింది.

15వ కంటెస్టెంట్ గా అఖిల్ సార్థక్ ఎంటర్ అయ్యాడు.

లేట్ వయసులో యూట్యూబ్ ద్వారా బాగా ఫేమస్ అయిన గంగవ్వ ఫైనల్ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు.

ఇకపై స్టార్ మాలో బిగ్ బాస్ 4 తో కొన్ని రోజులపాటూ సందడే సందడి.