మున్సిపాలిటీలకు కేటీఆర్ వరం..

తెలంగాణలోని మున్సిపాలిటీలకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వరమిచ్చారు. ప్రతీనెలా మున్సిపాలిటీలకు 148 కోట్లు విడుదల చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. వచ్చే 6 నెలల్లో మున్సిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు పేర్కొన్నారు.పట్టణ ప్రగతిలో భాగంగా పారిశుధ్యంపై దృష్టి సారించామని.. చెత్త సేకరించే వాహనాల సంఖ్యను 4975కి పెంచామని కేటీఆర్ తెలిపారు. 783 కోట్లతో నగరాల్లో పారిశుధ్య నిర్వహణ జరుగుతుందన్నారు. పట్టణాలు క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

*కవిత భర్తకు కరోనా

ఒక మంత్రి కేటీఆర్ బావ కవిత భర్త అనిల్ కు కరోనా పాజిటివ్ అని తేింది. కవిత ఈ మేరకు స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వివరించారు. ప్రస్తుతం వీరి కుటుంబం అంతా క్వారంటైన్ లో ఉంటోందని.. తమను కలిసేందుకు రావద్దని కవిత ట్వీట్ చేశారు.

అనిల్ కరోనా బారినపడ్డారని.. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని కవిత తెలిపారు. తమను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేసుకోవాలని సూచించారు.