అఖిల్ బర్త్ డే సందర్భంగా ‘బ్యాచిలర్’ నుండి న్యూ లుక్..

అఖిల్ నటన డ్యాన్సులు ఫైట్స్ పరంగా అతడి హార్డ్ వర్క్ తెరపై కనిపిస్తోంది. ఆరంభమే అక్కినేని చియాన్ గా అభిమానుల గుండెల్లో నిలిచాడు. కానీ ఆశించిన విజయం దక్కడం లేదు. అఖిల్ – హలో- మిస్టర్ మజ్ను ఇలా వరుసగా ఫ్లాపులే ఎదురయ్యాయి. అయితే అన్నిటినీ అధిగమించి కింగ్ నాగార్జున వారసుడు సత్తా చాటుతాడనే అభిమానులు ఆశిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 సంస్థ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` చిత్రాన్ని ప్రారంభించింది. పూజా హెగ్డే లాంటి లక్కీ ఛామ్ అఖిల్ కి జతగా నటిస్తోంది. ఇక ఈ మూవీతో అఖిల్ కి కచ్ఛితంగా హిట్టొస్తుందనే అభిమానులు నమ్ముతున్నారు. ఈ చిత్రం నుంచి ఇంతకుముందు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. పూజాతో రొమాన్స్ వర్కవుటవుతోందని అర్థమైంది. తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నుంచి కొత్త లుక్ ని రిలీజ్ చేశారు. ఏప్రిల్ 8 అఖిల్ బర్త్ డే సందర్భంగా చిత్రబృందం శుభాకాంక్షలు చెబుతూ కొత్త పోస్టర్ ని లాంచ్ చేయగా వైరల్ గా మారింది.

ఈ పోస్టర్ లో అఖిల్ లుక్ మ్యాకోమ్యాన్ నే తలపిస్తోంది. అతడు బాగా కండలు పెంచి కనిపిస్తున్నాడు. సింపుల్ గా స్మైలిస్తూ అంతే సహజసిద్ధమైన లుక్ తోనూ చియాన్ అఖిల్ కనిపిస్తున్నాడు. ఇప్పటికే సోషల్ మీడియాల్లో అఖిల్ అభిమానుల హంగామా పీక్స్ లోనే ఉంది. ఫ్యాన్స్ అతడికి ముందస్తుగానే బర్త్ డే శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇండస్ట్రీ సహచరులు అఖిల్ తాజా చిత్రంతో పెద్ద విజయం అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. జూన్ 19న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రిలీజ్ కానుంది.