తెలంగాణ ఉద్యోగులను రిలీవ్‌ చేసిన ఏపీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో విధులు నిర్వహిస్తున్న తెలంగాణ ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం రిలీవ్‌ చేసింది. ఏపీ సచివాలయంలో పనిచేస్తున్న 49 మంది తెలంగాణ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఉద్యోగులను రిలీవ్‌ చేస్తూ ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పునర్విభజన చట్టం కింద ఉద్యోగులను రిలీవ్‌ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.