సైబరాబాద్‌లో కొవిడ్‌ ఉచిత టెలీమెడిసిన్‌ కాల్‌ సెంటర్‌ ప్రారంభం

సైబరాబాద్‌ కమిషనరేట్‌లో కొవిడ్‌ ఉచిత టెలీమెడిసిన్‌ కాల్‌ సెంటర్‌ను కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ మంగళవారం ప్రారంభించారు. సైబరాబాద్‌ పోలీసులు, ఎస్‌సీఎస్‌సీ (సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌), ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు కలిసి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని సీపీ తెలిపారు. ఇందుకు ప్రత్యేకంగా ఫోన్‌ +91804511138 కేటాయించామన్నారు. బాధితులు ఫోన్‌ చేసి వైద్య నిపుణుల సలహాలు, సూచనలు పొందవచ్చన్నారు. ఎస్‌సీఎస్‌సీ ఆరోగ్య విభాగం సంయుక్త కార్యదర్శి డా.రాజీవ్‌ మేనన్‌ నేతృత్వంలో కొనసాగే ఈ కేంద్రంలో 20 మంది వైద్యులు అందుబాటులో ఉంటారన్నారు. వర్చువల్‌ విధానంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్‌సీఎస్‌సీ ప్రధాన కార్యదర్శి కృష్ణ యెదుల, డా.రాజీవ్‌ మేనన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ కేంద్రం ద్వారా కొవిడ్‌ లక్షణాలు, జాగ్రత్తలు, సింప్టమాటిక్‌, అసింప్టమాటిక్‌ బాధితులకు.. వైద్యం, పర్యవేక్షణ, ఆసుపత్రిలో ప్రవేశించాల్సిన విషయంలో సూచనలు పొందవచ్చు.