ఏపీ, తెలంగాణ ప్రయాణికులపై ఢిల్లీ ఆంక్షలు..

ఏపీ, తెలంగాణల నుంచి వచ్చే ప్రయాణికులపై ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆంక్షలు విధించింది. తెలుగు రాష్ట్రాల్లో కొత్త రకం కరోనా వేరియంట్ ఉండని, అది మరింత ప్రమాదకరమని భావిస్తున్న నేపథ్యంలో ఈ ఆంక్షలు విధిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. కరోనా నెగెటివ్ సర్టిఫికెట్‌ ఉన్నవారికి మాత్రమే ఢిల్లీలోకి అనుమతిస్తున్నట్లు వెల్లడించింది. నెగెటివ్ సర్టిఫికేట్ లేని వారు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని తెలిపింది.